డ్రంక్ & డ్రైవ్ నిర్వహించిన పోలీసులు

ELR: నిడమర్రులో శుక్రవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నిడమర్రు సీఐ రజిని కుమార్, గణపవరం ఎస్‌సై మణికుమార్ నేతృత్వంలో ఆటోలు, స్కూల్, కాలేజీ బస్సుల డ్రైవర్లపై డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారన్న సమాచారంపై స్పందించిన పోలీసులు బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించారు.