చిరుత సంచారం..కెమెరాకు చిక్కిన దృశ్యాలు

చిరుత సంచారం..కెమెరాకు చిక్కిన దృశ్యాలు

GDWL: ​మల్దకల్ మండలంలోని నేతువానిపల్లి గ్రామంలో గత మూడు నెలలుగా చిరుత పులి సంచరిస్తుండటం గ్రామస్తులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. ఈ ప్రాంతంలో వరుసగా మూగజీవాలపై దాడులు జరుగుతుండటంతో అటవీశాఖ అధికారులు స్పందించి, గురువారం అటవీ ప్రదేశంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. తాజాగా ఒక జంతువుపై చిరుత దాడి చేస్తున్న దృశ్యాలు ఈ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.