చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి: ఎస్సై

సంగారెడ్డి: పిల్లలకు వాహనాలు ఇవ్వద్దని రాయికోడ్ ఎస్సై నారాయణ అన్నారు. ఆదివారం ఆయన ప్రకటనలో మాట్లాడుతూ.. వాహనాలు నడుపుతూ అనేక ప్రమాదాలకు గురౌతున్నారని అన్నారు. పిల్లలు చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా బడిలో ఉపాధ్యాయులు, ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలపై నిఘా పెట్టాలన్నారు. విద్యార్థి దశలోనే పిల్లలలో మార్పు తెచ్చే అవకాశం ఉందన్నారు.