రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

KNR: హుజురాబాద్ మండలంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిర్సపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద గుర్తు తెలియని వాహనం బైక్‌ని ఢీకొనడంతో నందిపేటకు చెందిన హర్షిత్‌ (18) మృతిచెందాడు. అలాగే వెనుక కూర్చున్న త్రినేష్‌ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.