భారీ వర్షాలతో పంట నష్టం

భారీ వర్షాలతో పంట నష్టం

వికారాబాద్: భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరానికి రూ.30,000 పరిహారం అందించాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌ రెడ్డి కోరారు. ఇటీవల కురిసిన వర్షాలతో పరిగి మండలం పోల్కంపల్లి గ్రామ శివారులో పత్తి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎమ్మెల్యే పంట పొలాలను పరిశీలించి, రైతులను ఆదుకోవాలన్నారు.