ఆలయ అభివృద్ధికి గత ప్రభుత్వం నిర్లక్ష్యం: MLA
MHBD: జిల్లా కేంద్రంలోని అనంతాద్రి శ్రీ భూనీల వెంకటేశ్వరస్వామి ఆలయ 21వ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం MLA మురళీ నాయక్, DCC అధ్యక్షురాలు ఉమా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఆలయ అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. త్వరలోనే ఆలయానికి కనీస వసతులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.