కరీంనగర్ డైరీ ఆధ్వర్యంలో పుస్తె మెట్టల పంపిణీ

KNR: బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన పాడి రైతు కల్లూరి కనకయ్య రాజవ్వల కూతురు రేణుక వివాహానికి కరీంనగర్ డైరీ ఆధ్వర్యంలో ఆదివారం పుస్తే మెట్టల పంపిణీ చేసినట్లు డైరీ అధ్యక్షులు ఎలిగే సతీష్ తెలిపారు. కొన్నేళ్లుగా కనకయ్య డైరీలో పాలు పోస్తున్నారని, పాల ఉత్పత్తిదారుల ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో డైరీ ఇలాంటి బృహత్తర కార్యక్రమాలు చేపట్టిందని సతీష్ అన్నారు.