బాబు జగ్జీవన్‌ రామ్‌కు డీఎంహెచ్‌ఓ నివాళి

బాబు జగ్జీవన్‌ రామ్‌కు డీఎంహెచ్‌ఓ నివాళి

SRPT: సామాజిక సమానత్వానికి బాబు జగ్జీవన్‌ రామ్‌ చేసిన కృషి చిరస్మరణీయమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్‌ పెండెం వెంకటరమణ అన్నారు. ఆదివారం సూర్యాపేటలో ఆయన జయంతి వేడుకలను నిర్వహించారు. జగ్జీవన్‌ రామ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభివృద్ధికి ఆయన పడ్డ తపన నేటి తరానికి స్ఫూర్తిదాయకమని డీఎంహెచ్‌ఓ అన్నారు.