ఖరీఫ్ సాగుపై అవగాహన : ఏఈఓ

NRML: లోకేశ్వరం మండలం బిలోలి గ్రామంలో బుధవారం మండలం వ్యవసాయ విస్తరణ అధికారి ఉమేశ్ గ్రామస్థులకు ఖరీఫ్ సాగుపై సమావేశం నిర్వహించారు. నకిలీ విత్తనాల గురించి జాగ్రతగా ఉండాలని, కెమికల్ ఎరువులకు బదులు సేంద్రియ ఎరువులు వాడాలని, పీఎస్బీపై గ్రామ రైతులకి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు, యువకులు పాల్గొన్నారు.