'రక్తదానానికి దాతలు ముందుకు రావాలి'

MNCL: మంచిర్యాలలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది బుధవారం రక్తదానం చేశారు. ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంక్ ఇంచార్జ్ వి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. రక్తం కొరతతో తలసేమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులు, ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. దాతలు స్వచందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ఆయన కోరారు.