బోనాల ఊరేగింపులో జోగిని శ్యామల

బోనాల ఊరేగింపులో జోగిని శ్యామల

MBNR: కంఠ మహేశ్వర స్వామి (కాటమయ్య) విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం సురమాంబ, వనం ఎల్లమ్మ, వనం మైసమ్మల బోనాల ఊరేగింపు నిర్వహించారు. తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన తొలి బోనం ఎత్తే జోగిని శ్యామల బోనం ఎత్తుకుని ఏనుగొండ ఆంజనేయస్వామి ఆలయం నుంచి కంఠమహేశ్వర స్వామి దేవాలయం వరకు సమూహంగా వెళ్లారని ఆలయ నిర్వాహకులు తెలిపారు.