పాలమూరు అగ్రో డైరెక్టర్ రమేష్ రెడ్డి అరెస్ట్
MBNR: పాలమూరు అగ్రో కాంప్లెక్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఎస్.రమేష్ రెడ్డిని బుధవారం SFO అధికారులు అరెస్టు చేశారు. ప్రమోటర్లకు తెలియకుండా నకిలీ పత్రాలతో సంస్థకు చెందిన రూ.300 కోట్ల విలువైన 100 ఎకరాల భూమిని విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయని వారు తెలిపారు. కోర్టు వారెంట్ జారీ చేయడంతో, ఆయన్ను అధికారులు జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు.