యాంత్రిక శక్తిని వినియోగించు కోవాలి
BDK: మణుగూరు ఏరియాలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించడానికి శ్రామికశక్తితో పాటు యాంత్రిక శక్తిని వినియోగించాలని సింగరేణి డైరెక్టర్ కొప్పుల వెంకటేశ్వర్లు సూచించారు. నిన్న మణుగూరులో పర్యటించిన ఆయన ఓసీ 2, ఓసీ 4, మణుగూరు ఓసీ గనులను సందర్శించారు. అధికోత్పత్తికి అవసరమైన అన్ని రకాల వనరులకు యాజమాన్యం ఆమోదం తెలుపుతుందని ఆయన హామీ ఇచ్చారు.