డిమాండ్ ఉన్న పంటలు పండించాలి: రమాకాంత్ రెడ్డి
కర్నూలు: రైతు సేవ కేంద్రంలో బుధవారం జరిగిన 'రైతన్న మీకోసం' ముగింపు సభలో రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి రమాకాంత్ రెడ్డి పాల్గొన్నారు. రైతులు ఒకే పంటలు కాకుండా డిమాండ్ ఉన్న పంటల వైపు మొగ్గు చూపాలని ఆయన సూచించారు. వ్యవసాయంలో డ్రోన్లు, స్వింకర్ల వంటి టెక్నాలజీని వాడుకోవాలన్నారు. సొసైటీల ద్వారా రుణాలు అందించి, ఈ ప్రభుత్వంలో రైతుకు గౌరవం దక్కిందని ఆయన తెలిపారు.