శ్రీపాదరావు సేవలు చిరస్మరణీయం: కలెక్టర్

శ్రీపాదరావు సేవలు చిరస్మరణీయం: కలెక్టర్

KMR: శాసనసభ సభాపతి పదవికి దుద్దిళ్ల శ్రీపాదరావు వన్నె తెచ్చారని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కొనియాడారు. సోమవారం కలెక్టరేట్‌లో యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఆయన జయంతి వేడుకలు నిర్వహించారు. శ్రీపాదరావు చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్, ఆర్డీవో వీణ, డీవైఎస్‌వో వెంకటేశ్వర్లు ఉన్నారు