తీరిన కర్ణకోట గ్రామస్థుల గ్యాస్ కష్టాలు

తీరిన కర్ణకోట గ్రామస్థుల గ్యాస్ కష్టాలు

VKB: తాండూర్ మండలం కర్ణకోటలో కొన్ని రోజులుగా నెలకొన్న వంట గ్యాస్ కొరత ఎట్టకేలకు తీరింది. గ్యాస్ బుకింగ్ కాక ఇబ్బందులు పడుతున్న గ్రామస్థుల కోసం ఆదివారం అంబా భవాని గ్యాస్ ఏజెన్సీ ప్రత్యేకంగా సరఫరా చేపట్టింది. సిలిండర్లు అందడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సెలవు రోజైనప్పటికీ గ్యాస్ పంపిణీ చేయడంతో స్థానికులకు పెద్ద ఊరట లభించింది.