స్తంభం పై నుంచి పడి వ్యక్తికి తీవ్ర గాయాలు

స్తంభం పై నుంచి పడి వ్యక్తికి తీవ్ర గాయాలు

PPM: వీరఘట్టం మండలం తూడి గ్రామంలో విద్యుత్ స్తంభం పై నుంచి జారిపడి ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మనోజ్ అనే యువకుడు కొత్త విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసే క్రమంలో ప్రమాదవశాత్తు స్తంభంపై నుంచి జారి కిందపడ్డాడని పేర్కొన్నారు. ఈ ఘటనలో అతని తలకు తీవ్ర గాయమవ్వగా, 108 వాహనంలో పాలకొండ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.