VIDEO: బస్సు ప్రమాదం.. నలుగురికి తీవ్ర గాయాలు
NTR: కావేరి ట్రావెల్స్ బస్సుకు మరోసారి ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తుండగా అనసాగరం బైపాస్ వద్ద లారీని బస్సు ఢీకొట్టింది. బస్సులో 20 మంది ప్రయాణికులు ఉండగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు. హైవే మొబైల్ సిబ్బంది ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సహాయక చర్యలు చేపడుతున్నారు.