చదలవాడలో గృహ ప్రవేశాల కార్యక్రమం
BPT: 'ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0' కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని చదలవాడ గ్రామంలో గృహ ప్రవేశాల కార్యక్రమం ఇవాళ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొని రిబ్బన్ కటింగ్ చేసి గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి అర్హుడికి గృహం అందే వరకు ఈ పథకం కొనసాగుతుందని ఆయన తెలిపారు.