'విద్యార్థులకు ప్రభుత్వం చేయూత'
VKB: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం చేయూత అందిస్తుందని సోమవారం మండల విద్యాధికారి అభి అహ్మద్ తెలిపారు. కుల్కచర్లలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల విద్యా బోధనపై తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయులు బోధించే పాఠాలను ఇంటి దగ్గర (హోంవర్క్) చదువుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఎంఈవో సూచించారు.