ప్రకాశం జిల్లాకు వర్ష సూచన
ప్రకాశం జిల్లాలో కొన్ని రోజులుగా చలి ప్రభావం అధికం కావడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలిసిందే. అయితే ,తాజాగా ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ ఆదివారం జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. ఇప్పటికే చలిగాలుల ధాటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వృద్ధులు, చిన్నారులు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సైతం వారు సూచించారు.