సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు పెంపు

KRNL: ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువును మే 5వ తేదీ వరకు పొడిగించినట్లు డీవీఈవో సురేష్ బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమాచారాన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు విద్యార్థులకు తెలపాలని పేర్కొన్నారు.