ఎస్పీ కార్యాలయంలో 31 అర్జీలు స్వీకరణ

ఎస్పీ కార్యాలయంలో 31 అర్జీలు స్వీకరణ

కోనసీమ: అమలాపురంలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 31 దరఖాస్తులు అందాయని ఎస్పీ రాహుల్ మీనా ఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదుదారులతో ఎస్పీ నేరుగా మాట్లాడి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.