వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

మహబూబాబాద్  పట్టణ కేంద్రంలోని పత్తిపాక రోడ్డులో ఓ అద్దె భవనంలో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న వ్యభిచారం గృహంపై ఆదివారం తెల్లవారుజామున పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు నిర్వాహకులు, వ్యభిచారంలో పాల్గొంటున్న మరో ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.