ఈనెల 19న పద్మనాభం రానున్న యువ హీరో
విశాఖ: ఈ నెల 19వ తేదీన శ్రీ అనంత పద్మనాభస్వామి వారి కోటి దీపోత్సవం సందర్భంగా తెలుగు యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పద్మనాభం రానున్నారు. బుధవారం సాయంత్రం 5:00లకు దీపారాధన కార్యక్రమంలో పాల్గొననున్నారు. అలాగే పద్మనాభంలో వెలసియున్న శ్రీ కుంతి మాధవి స్వామి వారిని దర్శించుకోనున్నారు.