బాల్య వివాహాలపై అవగాహన అవసరం

అన్నమయ్య: తల్లిదండ్రులు బాల్యవివాహాలు చేయడం మానుకోవాలని పేటీఎం ఎస్సై నరసింహుడు తెలిపారు. వెలుగు కార్యాలయంలో వెలుగు సిబ్బంది, స్థానిక ప్రజలతో బుధవారం బాల్య వివాహ్ ముక్త్ భారత్ కార్యక్రమంలో బాల్య వివాహాలను అరికట్టడంపై అవగాహన సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్సై నరసింహుడు మాట్లాడుతూ.. ఇకపై ఎవ్వరూ బాల్యవివాహాలు చేయరాదని, అలా చేస్తే నేరమని చెప్పారు.