మత్తుపదార్థాల అనర్థాలపై అవగాహన సదస్సు
MHBD: మత్తుపదార్థాలు, మద్యపానం వల్ల కలిగే అనర్థాలపై కౌన్సిలింగ్ కార్యక్రమం రేపు కంఠాయపాలెం గ్రామంలో నిర్వహించనున్నారు. శ్రీ కృష్ణ యాదవ సేన, హెల్పింగ్ హ్యాండ్స్ సంయుక్తంగా ఉదయం 7 గంటలకు కార్యక్రమం ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా వైద్యులచే కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తొర్రూరు పోలీస్, హెల్త్ డిపార్ట్‌మెంట్ హాజరుకానున్నారు.