మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. నేడు మరోసారి విచారణ
TG: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని సిట్ అధికారులు కస్టడీలో విచారిస్తున్నారు. గతంలో నిర్వహించిన డ్రగ్ పార్టీలు, డ్రగ్స్ సరఫరాదారులతో ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కోర్టు అనుమతితో ఇవాళ మరోసారి రోహిత్ రెడ్డిని విచారించి, ఈ డ్రగ్స్ నెట్‌వర్క్‌కు సంబంధించిన మరిన్ని కీలక వివరాలను సేకరించనున్నారు.