పట్టణ ప్రగతి పనులను పరిశీలించిన కలెక్టర్

పట్టణ ప్రగతి పనులను పరిశీలించిన కలెక్టర్

NRPT: కోస్గి మున్సిపాలిటీలో జరుగుతున్న పట్టణ ప్రగతి పనులను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పరిశీలించారు. ఇవాళ ఆయన కోస్గి పట్టణంలోని పట్టణ సభా సమావేశానికి ముఖ్య అథితిగా హాజరయ్యారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. మున్సిపల్ కమిషనర్ నాగరాజు, ఛైర్మన్ నరేందర్‌తో కలిసి అభివృద్ధి పనులపై వివరాలు సేకరించి పనులను దగ్గరికి వెళ్లి పరిశీలించారు.