తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

BHNG: మోత్కూరు మండలం దాచారం గ్రామానికి చెందిన ఆండెం కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి ఇవాళ సాయంత్రం పాముకాటుతో మృతి చెందాడు. ఆయన మృతితో దాచారం గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. అండెం కరుణాకర్ రెడ్డికి భార్య బాలామణి , స్వాతి, శృతి ఇద్దరు కూతుర్లు లు ఉన్నారు. కొడులకులు లేకపోవడంతో పెద్ద కూమార్తె స్వాతి తల కొరివి పెట్టారు.