గూఢచారి పావురం కాదు.. రేసింగ్ పావురం

గూఢచారి పావురం కాదు.. రేసింగ్ పావురం

NZB: బోధన్ మండలంలోని భవానిపేట గ్రామంలో గూఢచారి పావురం కలకలం రేపింది. ఒక బాలుడికి దొరికిన పావురం కాలికి కోడ్ రింగ్ ఉండటంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పావురాన్ని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అది గూఢచారి పావురం కాదని, రేసింగ్ పావురమని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.