సౌతాఫ్రికా టీ20 లీగ్ ఆడనున్న పియూశ్ చావ్లా

సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025 వేలంలో 13 మంది భారత ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో ముంబై ఇండియన్స్ మాజీ ప్లేయర్ పియూశ్ చావ్లా, ఐపీఎల్ మాజీ ఆటగాళ్లు సిద్దార్థ్ కౌల్, అంకిత్ రాజ్‌పుత్ ఉన్నారు. సెప్టెంబర్ 9న జరగనున్న వేలంలో 84 మంది ఆటగాళ్లను తీసుకునే అవకాశం ఉంది. కాగా, భారత ప్లేయర్ వేరే దేశం లీగ్‌లో ఆడితే భారత క్రికెట్‌తో పాటు IPL ఆడే అర్హత కోల్పోతాడు.