విధులు బహిష్కరించి ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన
SRD: జహీరాబాద్ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నేడు డిపోకు చెందిన కండక్టర్లు, డ్రైవర్లు విధులను బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ అధికారులు ప్రైవేట్ అద్దె బస్సులను నడుపుతూ ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తున్నారు.