PHCలో గర్భిణులకు వైద్య పరీక్షలు

PHCలో గర్భిణులకు వైద్య పరీక్షలు

JGL:పెగడపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారి డా.నరేశ్ ఆధ్వర్యంలో గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు గర్భిణులకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. రక్త నమూనాలు సేకరించి, రక్తహీనత ఉన్నవారికి పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు