అక్కయ్యపాలెంలో స్నాచింగ్ యత్నం
విశాఖ నగరంలోని అక్కయ్యపాలెం సాది ఖాన్ ప్రాంతంలో వృద్ధురాలిపై చైన్ స్నాచింగ్ యత్నం కలకలం రేపింది. దుండగులు ఆమె మెడలోని బంగారు గొలుసు లాగేందుకు ప్రయత్నించగా, అదృష్టవశాత్తూ ఆమెకు ఎలాంటి నష్టం జరగలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.