ప్లాట్లు మాయం చేశారని హైడ్రాకు ఫిర్యాదు
RR: కుంట్లూరు విలేజ్ సర్వే నంబరు 204లో దాదాపు 15 ఎకరాల మేర 800ల ప్లాట్లతో అంజానాద్రినగర్ పేరిట లే ఔట్ వేశారు. పక్కనే లే ఔట్ వేసిన వారు తమ లే అవుట్‌లోకి జరిగి రహదారితో పాటు.. కొన్ని ప్లాట్లు మాయం చేశారంటూ అంజనాద్రి ప్లాట్ యజమానులు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. త్వరలో తనిఖీలు చేపట్టి, చర్యలు తీసుకుంటామని హైడ్రా పేర్కొంది.