గ్రామాల్లోని ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించాలి: MLA
ADB: గ్రామాల్లోని ప్రతి ఒక్క సమస్యను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని బోథ్ MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. 'ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా నేరడిగొండ మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు.