'బెల్లంపల్లి అభివృద్ధికి నిధులు విడుదల చేయాలి'
MNCL: బెల్లంపల్లి పట్టణ అభివృద్ధికి అవసరమైన నిధులను విడుదల చేయాలని మున్సిపల్ ఛైర్‌పర్సన్ దావ స్వాతి కోరారు. బుధవారం ఎమ్మెల్యే వినోద్ కలిసి హైదరాబాద్‌లో పురపాలక డైరెక్టర్ టి.కె. శ్రీదేవికి వినతిపత్రం అందజేశారు. డంపింగ్ యార్డ్, అంతర్గత రహదారులు, వైకుంఠధామం అభివృద్ధి చేయాలని, అలాగే 11 కొత్త స్వచ్ఛ ఆటోల కొనుగోలుకు నిధులు కేటాయించాలని ఆమె విన్నవించారు.