నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

ప్రకాశం: పెద చెర్లోపల్లి మండలంలో శుక్రవారం ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పర్యటిస్తారని మండల టీడీపీ అధ్యక్షులు వేమూరి రామయ్య తెలిపారు. వెంగలాపురం గ్రామంలో పాలేటి గంగమ్మ తల్లి ఆలయం వద్ద నిర్మించిన నూతన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభిస్తారన్నారు. అదేవిధంగా గంగమ్మ తల్లి తిరునాళ్ల సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారన్నారు.