అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత

అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత

NZB: చందూరు మండల కేంద్రం శివారులోని శనివారం వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టరును రెవెన్యూ సిబ్బంది పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో దాడులు నిర్వహించి, వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని, వాహనాలను సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు. నిందితులపై కేసు నమోదు చేశారు.