'నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి'
PPM: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా వినియోగించాలని గరుగుబిల్లి ఎస్సై ఫక్రుద్దీన్ తెలిపారు. ఆదివారం గరుగుబిల్లిలో వాహన తనిఖీలు చేపట్టారు. వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని, లైసెన్స్, సీబుక్, ఇన్సరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ ఉండాలని వాహనదారులకు సూచించారు. నిబంధనలు పాటించని వాహనదారులకు ఆన్‌లైన్ చలనాలు విధించారు.