సంజూ కోసం అందుకే పోరాడా: గంభీర్
సంజూ శాంసన్ ఎన్నో సార్లు రన్స్ చేయలేక వెనుదిరిగినా.. అతనికి కోచ్ గంభీర్ వరుస అవకాశాలు ఇస్తూ వచ్చాడు. భారత జట్టు కోసం సంజూ ఎంతో చేయగలడని నమ్మానని, అందుకే తనకు మద్దతుగా నిలిచానని ANI ఇంటర్వ్యూలో గౌతీ పేర్కొన్నాడు. తన నమ్మకానికి సంజూ T20 WCలో న్యాయం చేశాడని, అతని కెరీర్‌కి ఇది మరో కిక్ స్టార్ట్ ఇస్తుందని ఆశాభావం వ్యక్తంచేశాడు.