విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే

కోనసీమ: ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో మార్కులు సాధించిన ఆత్రేయపురం మహాత్మా గాంధీ జూనియర్ కాలేజీ విద్యార్థులను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వాడపాలెం కార్యాలయం వద్ద శనివారం అభినందించారు. ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాల్లో ఎంపీసీ లో అధిక మార్కులు సాధించిన పలువురి విద్యార్థులను అభినందించి వారికి జ్ఞాపికలు అందజేశారు.