విద్యుత్ షాక్‌తో మహిళ మృతి
BDK: బూర్గంపాడు మండలం పట్టి నగర్ గ్రామంలో ఇవాళ విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మేకల రమాదేవి అనే మహిళ కిరాణా షాపు నడుపుతూ జీవితం గడుపుతున్నారు. వ్యాపార నిమిత్తం యధావిధిగా షాపు తెరిచేందుకు వెళ్లి డోర్ పట్టుకోగా అందులో విద్యుత్ ప్రవహించడంతో కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.