రూ. కోట్లలో ఖర్చు.. బ్రిడ్జి పరిస్థితి అధ్వానం
KDP: రూ.కోట్లు ఖర్చు చేసి కొండాపురం మండలం ఏటూరు వద్ద చిత్రావతి నదిపై బ్రిడ్జి పనులు చేపట్టారు. సంవత్సరం గడవక ముందే బ్రిడ్జిపై గుంతలు పడి కడ్డీలు బయటపడ్డాయి. నాసిరకం పనులతో ఇలా జరిగిందని, దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు అంటున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి బ్రిడ్జిపై ఏర్పడిన గుంతలను పూడ్చాలని కోరుతున్నారు.