సబ్సిడీపై వ్యవసాయ పరికరాల పంపిణీ
MBNR: మహమ్మదాబాద్ మండలం నంచర్ల రైతువేదిక వద్ద రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు. ఇందులో భాగంగా ఐదుగురికి గడ్డి కట్టే యంత్రాలు (Baler), ఇద్దరికి రోటవేటర్లను అందజేశారు. ప్రభుత్వం సబ్సిడీ ద్వారా రైతులకు అండగా నిలుస్తోందని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కేఎం.నారాయణ, ఏవో నరేందర్ పేర్కొన్నారు.