గుంటూరు రైల్వే మేనేజర్‌గా సుధేష్ణ సేన్

గుంటూరు రైల్వే మేనేజర్‌గా సుధేష్ణ సేన్

గుంటూరు రైల్వే డివిజన్ నూతన డీఆర్ఎంగా సుధేష్ణ సేన్ సోమవారం ఉదయం డీఅర్ఎం రామక్రిష్ణ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈమె 1996 బ్యాచ్ ఐఅర్ఏఎస్ నుంచి నార్తన్ రైల్వేకు ఆర్థిక సలహాదారు, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్‌గా పనిచేశారు. ఆమె రైల్వే ఫైనాన్స్‌లో నిష్ణాతులు, వ్యూహాత్మక దృష్టిలో నాయకత్వంలో ఖ్యాతిని సంపాదించారు.