భారీ వర్షం.. కుప్పకూలిన భారీ జాతీయ జెండా..!
ఏలూరులో భారీ వర్షం, ఈదురు గాలులకు NH-16 పక్కన ఉన్న 237 అడుగుల ఎత్తైన జాతీయ పతాకం కింద పడింది. దేశంలో మూడవ అతిపెద్ద పతాకంగా పేరుగాంచిన ఇది హైవేపై పడటంతో స్థానికులు తక్షణమే స్పందించి భద్రపరిచారు. ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన ఈ ఘటనలో జెండాకు ఎటువంటి అవమానం జరగకుండా గ్రామస్థులు చూపిన అప్రమత్తత, దేశభక్తిని పలువురు అభినందిస్తున్నారు.