గూడురు చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే

తిరుపతి: గూడూరు చెరువును శనివారం ఎమ్మెల్యే డా.పాశం సునీల్ కుమార్ జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాతో కలిసి పరిశీలించారు. చెరువుకట్ట పనులు, సుందరీకరణ కొరకు నిధులను వెంటనే మంజూరు చేయాలని ఎమ్మెల్యే కలెక్టర్‌ను కోరారు. వెంటనే స్పందించిన కలెక్టర్ అంచనాల ప్రతిపాదనలను త్వరతిగతిన సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.