ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తుంది: MLA
HNK: ఐనవోలు మండలం ముల్కలగూడెం గ్రామంలో SDF నిధులు రూ.25 లక్షల వ్యయంతో చేపట్టనున్న రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యాలకు బుధవారం MLA నాగరాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోందని, మౌలిక సౌకర్యాల్లో రాజీ లేదని MLA స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.